Bathukamma Songs Lyrics – బతుకమ్మ టాప్ సాంగ్స్‌

ఏమిమి పువ్వోప్పునే గౌరమ్మ

ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ..

తంగేడు పువ్వప్పునే గౌరమ్మ.. తంగేడు కాయప్పునే గౌరమ్మ..

తంగేడు చెటుకింద ఆటసిలకలాల పాటసిలకలాల కలికిసిలకలాల

కందుమ్మగుట్టలు  రానువోనడుగులు తీరుద్దరాషలు తారుగోరంటలు..

గనమైన పున్నపూవే గౌరమ్మ.. గజ్జెలా వడ్డాలమే గౌరమ్మ..

ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ..

గుమ్మాడి పువ్వప్పునే గౌరమ్మ.. గుమ్మాడి కాయప్పునే గౌరమ్మ..

గుమ్మాడి చెటుకింద ఆటసిలకలాల పాటసిలకలాల కలికిసిలకలాల

కందుమ్మగుట్టలు  రానువోనడుగులు తీరుద్దరాషలు తారుగోరంటలు..

గనమైన పున్నపూవే గౌరమ్మ.. గజ్జెలా వడ్డాలమే గౌరమ్మ..

ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ..

రుద్రాశ పువ్వప్పునే గౌరమ్మ.. రుద్రాశ కాయప్పునే గౌరమ్మ..

రుద్రాశ చెటుకింద ఆటసిలకలాల పాటసిలకలాల కలికిసిలకలాల

కందుమ్మగుట్టలు  రానువోనడుగులు తీరుద్దరాషలు తారుగోరంటలు..

గనమైన పున్నపూవే గౌరమ్మ.. గజ్జెలా వడ్డాలమే గౌరమ్మ..

ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ..

కాకరా పువ్వప్పునే గౌరమ్మ.. కాకరా కాయప్పునే గౌరమ్మ..

కాకరా చెటుకింద ఆటసిలకలాల పాటసిలకలాల కలికిసిలకలాల

కందుమ్మగుట్టలు  రానువోనడుగులు తీరుద్దరాషలు తారుగోరంటలు..

గనమైన పున్నపూవే గౌరమ్మ.. గజ్జెలా వడ్డాలమే గౌరమ్మ..

ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ..

చామంతి పువ్వప్పునే గౌరమ్మ.. చామంతి కాయప్పునే గౌరమ్మ..

చామంతి చెటుకింద ఆటసిలకలాల పాటసిలకలాల కలికిసిలకలాల

కందుమ్మగుట్టలు  రానువోనడుగులు తీరుద్దరాషలు తారుగోరంటలు..

గనమైన పున్నపూవే గౌరమ్మ.. గజ్జెలా వడ్డాలమే గౌరమ్మ..

ఆపూలు తెప్పించి పూవాన వూదించి..

గంధంల కడిగించి .. కుంకుమలా జాడిచ్చి..

పసుపు గౌరమ్మతో..

నీనోము నీకిత్తుమే గౌరమ్మ.. మా నోము మాకీయవే గౌరమ్మ..

నీనోము నీకిత్తుమే గౌరమ్మ.. మా నోము మాకీయవే గౌరమ్మ..

ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ..

తంగేడు పువ్వప్పునే గౌరమ్మ.. తంగేడు కాయప్పునే గౌరమ్మ..

తంగేడు చెటుకింద ఆటసిలకలాల పాటసిలకలాల కలికిసిలకలాల

కందుమ్మగుట్టలు  రానువోనడుగులు తీరుద్దరాషలు తారుగోరంటలు..

గనమైన పున్నపూవే గౌరమ్మ.. గజ్జెలా వడ్డాలమే గౌరమ్మ.

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ – బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ – బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (1)

రాగిబింద తీసుక రమణి నీళ్లకు వోతే – రాములోరు ఎదురయ్యే నమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ – బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (2)

వెండి బింద తీసుక వెలది నీళ్లకు వోతే – వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ – బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (3)

బంగారు బింద తీసుక బామ్మా నీళ్లకు వోతే – భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ – బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (4)

పగిడి బింద తీసుక పడతి నీళ్లకు వోతే – పరమేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ – బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (5)

ముత్యాల బింద తీసుక ముదిత నీళ్లకు వోతే – ముద్దుకృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ – బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (6)

రామ రామ ఉయ్యాలో

రామ రామ రామ ఉయ్యాలో – రామనే శ్రీరామ ఉయ్యాలో

హరి హరి ఓ రామ ఉయ్యాలో – హరియ బ్రహ్మదేవ ఉయ్యాలో (1)

నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో – నెలవన్నెకాడ ఉయ్యాలో

పాపట్ల చంద్రుడా ఉయ్యాలో – బాల కోమారుడా ఉయ్యాలో (2)

ముందుగా నిను దల్తు ఉయ్యాలో – ముక్కోటి పోశవ్వ ఉయ్యాలో

అటెన్క నినుదల్తు ఉయ్యాలో – అమ్మ పార్వతమ్మ ఉయ్యాలో (3)

భక్తితో నిను దల్తు ఉయ్యాలో – బాసర సరస్వతీ ఉయ్యాలో

ఘనంగాను కొల్తు ఉయ్యాలో – గణపతయ్య నిన్ను ఉయ్యాలో (4)

ధర్మపురి నరసింహ ఉయ్యాలో – దయతోడ మముజూడు ఉయ్యాలో

కాళేశ్వరం శివ ఉయ్యాలో – కరుణతోడ జూడు ఉయ్యాలో (5)

సమ్మక్క సారక్క ఉయ్యాలో – సక్కంగ మముజూడు ఉయ్యాలో

భద్రాద్రి రామన్న ఉయ్యాలో – భవిత మనకు జెప్పు ఉయ్యాలో (6)

యాదితో నినుదల్తు ఉయ్యాలో – యాదగిరి నర్సన్న ఉయ్యాలో

కోటిలింగాలకు ఉయ్యాలో – కోటి దండాలురా ఉయ్యాలో (7)

కోర్కెతో నిను దల్తు ఉయ్యాలో – కొంరెల్లి మల్లన్న ఉయ్యాలో

కొండగట్టంజన్న ఉయ్యాలో – కోటి దండాలురా ఉయ్యాలో (8)

కోర్కెమీర దల్తు ఉయ్యాలో – కొత్తకొండీరన్న ఉయ్యాలో

ఎరుకతో నిను దల్తు ఉయ్యాలో – ఎములాడ రాజన్న ఉయ్యాలో (9)

ఓర్పుతో నిను దల్తు ఉయ్యాలో – ఓదెలా మల్లన్న ఉయ్యాలో

ఐలోని మల్లన్న ఉయ్యాలో – ఐకమత్య మియ్యి ఉయ్యాలో (10)

మన తల్లి బతుకమ్మ ఉయ్యాలో – మన మేలుకోరు ఉయ్యాలో

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో – బంగారు బతుకమ్మ ఉయ్యాలో (11)

శుక్రవారమునాడు ఉయ్యాలో

శుక్రవారమునాడు ఉయ్యాలో – చన్నీటి జలకాలు ఉయ్యాలో
ముత్యమంత పసుపు ఉయ్యాలో – పగడమంత పసుపు ఉయ్యాలో
చింతాకుపట్టుచీర ఉయ్యాలో – మైదాకు పట్టుచీరు ఉయ్యాలో
పచ్చపట్టుచీరు ఉయ్యాలో – ఎర్రపట్టుచీర ఉయ్యాలో
కురుసబొమ్మల నడుమ ఉయ్యాలో – భారీ బొమ్మల నడుమ ఉయ్యాలో
గోరంట పువ్వుల ఉయ్యాలో – బీరాయిపువ్వుల ఉయ్యాలో
రావెరావె గౌరమ్మ ఉయ్యాలో – లేచెనే గౌరమ్మ ఉయ్యాలో
అదేనే గౌరమ్మ ఉయ్యాలో – ముఖమంత పూసింది ఉయ్యాలో
పాదమంత పూసింది ఉయ్యాలో – చింగులు మెరియంగ ఉయ్యాలో
మడిమల్లు మెరియంగ ఉయ్యాలో – పక్కలు మెరియంగ ఉయ్యాలో
ఎముకలు మెరియంగ ఉయ్యాలో – కుంకుమబొట్టు ఉయ్యాలో
బంగారు బొట్టు ఉయ్యాలో – కొడుకు నెత్తుకొని ఉయ్యాలో
బిడ్డ నెత్తుకొని ఉయ్యాలో – మా యింటి దనుక ఉయ్యాలో

ఒక్కేసి పువ్వేసి చందమామా

ఒక్కేసి పువ్వేసి చందమామా – ఒక్క జాము ఆయె చందమామా
పైన మఠం కట్టి చందమామా – కింద ఇల్లు కట్టి చందమామా
మఠంలో ఉన్న చందమామా – మాయదారి శివుడు చందమామా
శివపూజ వేళాయె చందమామా – శివుడు రాకపాయె చందమామా
గౌరి గద్దెల మీద చందమామా – జంగమయ్య ఉన్నాడె చందమామా(1)

శివుడచ్చె యాల్లాయె సందమామ.. శివుడు రాకపాయె సందమామ…

శివుడికి శ్రీగద్దె సందమామ.. మాకు సారగద్దె సందమామ… (2)

రెండేసి పూలేసి చందమామా – రెండు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా – శివుడు రాకపాయె చందమామా (3)

మూడేసి పూలేసి చందమామా – మూడు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా – శివుడు రాకపాయె చందమామా

గోరంట సెట్లల్ల సందమామ.. గోడపెట్టబాయె సందమామ… (4)

నాలుగేసి పూలేసి చందమామా – నాలుగు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా – శివుడు రాకపాయె చందమామా

రుద్రాక్ష వనముల సందమామ.. నిద్రించపాయె సందమామ…(5)

ఐదేసి పూలేసి చందమామా – ఐదు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా – శివుడు రాకపాయె చందమామా

బంతి వనములోన సందమామ.. బంతులాడపాయె సందమామ… (6)

ఆరేసి పూలేసి చందమామా – ఆరు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా – శివుడు రాకపాయె చందమామా

మల్లె వనములోన సందమామ.. మాటలాడపాయె సందమామ… (7)

ఏడేసి పూలేసి చందమామా – ఏడు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా శివుడు రాకపాయె చందమామా

రత్నాలగౌరు సందమామ.. నీరాశికలుపుల్లు సందమామ… (8)

ఎనిమిదేసి పూలేసి చందమామా – ఎనిమిది జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా – శివుడు రాకపాయె చందమామా

తీగెతీగెలబిందె సందమామ.. రాగితీగెలబందె సందమామ… (9)

తొమ్మిదేసి పూలేసి చందమామా – తొమ్మిది జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా – శివుడు రాకపాయె చందమామా

రాశివడబోసి సందమామ.. రాశికలుపరావె సందమామ… (10)

పదేసి పులేసి సందమామ.. పది జాములాయే సందమామ..

శివపూజ వేళాయె చందమామా – శివుడు రాకపాయె చందమామా

తంగేడు వనములకు చందమామా – తాళ్లు కట్టబోయె చందమామా
గుమ్మాడి వనమునకు చందమామా – గుళ్లు కట్టబోయె చందమామా
రుద్రాక్ష వనములకు చందమామా – నిద్ర చేయబాయె చందమామా (11)

శ్రీరామ చంద్రుడు ఉయ్యాలో

శ్రీరామ చంద్రుడు ఉయ్యాలో – సీతతోకూడి ఉయ్యాలో
అయోధ్య పట్నాన ఉయ్యాలో – ఆనందమొప్ప ఉయ్యాలో
పట్టాభిషేకము ఉయ్యాలో – వైభవముగా సాగించే ఉయ్యాలో
యుద్ధాన సాయము ఉయ్యాలో – ఒనరించినట్టి ఉయ్యాలో
కపివీరులకును ఉయ్యాలో – రాక్షసవీరులకు ఉయ్యాలో
మనసారా విందు ఉయ్యాలో – భోజనము పెట్టించే ఉయ్యాలో
కపిల వీరులెల్ల ఉయ్యాలో – చక్కగా ఒకబంతి ఉయ్యాలో
కూర్చుండి భోజనము ఉయ్యాలో – చేసిరంత అపుడు ఉయ్యాలో
ఒక కోతి పులుసుతో ఉయ్యాలో – ఒక చేమ గడ్డ ఉయ్యాలో
తీసు కొని చేతిలో ఉయ్యాలో – గట్టిగా నొక్కేను ఉయ్యాలో

ఆ ముక్క గజమెత్తు ఉయ్యాలో – అల్లంత ఎగిరెను ఉయ్యాలో

అదిగని కోతి ఉయ్యాలో – అంత కన్నా ఎత్తు ఉయ్యాలో

ఎగిరినాతని కంటే ఉయ్యాలో – ఎగిరినింకో కోతి ఉయ్యాలో

ఎగురగా అల్లరి ఉయ్యాలో – ఎక్కువాయెను ఉయ్యాలో

సుగ్రీవుడెగిరెను ఉయ్యాలో – సూర్య మండలమంత ఉయ్యాలో

అంత రాముడు రాగ ఉయ్యాలో – అల్లరి అణిగే ఉయ్యాలో

ఎంతటి ఘనులైన ఉయ్యాలో – ఎంతటి వారైనా ఉయ్యాలో

ఎవరి స్వభావము ఉయ్యాలో – వారు మరువలేరు ఉయ్యాలో

కలవారి కోడలు ఉయ్యాలో

కలవారి కోడలు ఉయ్యాలో – కనక మహాలక్ష్మి ఉయ్యాలో
పప్పు కడుగుతున్నది ఉయ్యాలో – కడవల్లోనబోసి ఉయ్యాలో
అప్పుడే వచ్చాను ఉయ్యాలో – ఆమె పెద్దన్న ఉయ్యాలో
కాళ్లకు నీళ్లిచ్చి ఉయ్యాలో – కన్నీళ్లు తీసింది ఉయ్యాలో
ఎందుకు చెల్లెల్లా ఉయ్యాలో – ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో
తుడుచుకో కన్నీళ్లు ఉయ్యాలో – ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో
ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో – వెళ్లి వద్దామమ్మ ఉయ్యాలో
చేరి నీవారితో ఉయ్యాలో – చెప్పిరాపోవమ్ము ఉయ్యాలో
పట్టెమంచం మీద ఉయ్యాలో – పవళించిన మామ ఉయ్యాలో
మాయన్నలొచ్చిరి ఉయ్యాలో – మమ్ముబంపుతార ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో – మీ అత్తనడుగు ఉయ్యాలో
అరుగుల్ల గూసున్న ఉయ్యాలో – ఓ అత్తగారు ఉయ్యాలో
మా అన్నలొచ్చిరి ఉయ్యాలో – మమ్ముబంపుతార ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో – మీ బావనడుగు ఉయ్యాలో
భారతం సదివేటి ఉయ్యాలో – బావ పెద్ద బావ ఉయ్యాలో
మా అన్నలొచ్చిరి ఉయ్యాలో – మమ్ముబంపుతార ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో – మీ అక్కనడుగు ఉయ్యాలో
వంటశాలలో ఉన్న ఉయ్యాలో – ఓ అక్కగారు ఉయ్యాలో
మా అన్నలొచ్చిరి ఉయ్యాలో – మమ్ముబంపుతార ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో – మీ భర్తనే అడుగు ఉయ్యాలో
రచ్చలో గూర్చిన ఉయ్యాలో – రాజేంద్ర భోగి ఉయ్యాలో
మా అన్నలొచ్చిరి ఉయ్యాలో – మమ్ముబంపుతార ఉయ్యాలో
కట్టుకో చీరలు ఉయ్యాలో – పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో
ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో – వెళ్లిరా ఊరికి ఉయ్యాలో

తంగేడు పూవుల్ల చందమామ

తంగేడు పూవుల్ల చందమామ – బతుకమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగాని చందమామ – మల్లెన్నడొస్తావు చందమామ
యాడాదికోసారి చందమామ – నువ్వొచ్చిపోవమ్మ చందమామ (1)
బీరాయి పూవుల్ల చందమామ – బతుకమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగాని చందమామ – మల్లెన్నడొస్తావు చందమామ
యాడాదికోసారి చందమామ – నువ్వొచ్చి పోవమ్మచందమామ (2)
గునిగీయ పూవుల్ల చందమామ – బతుకమ్మ పోతుంది చందమామ
పోతే పోతివిగాని చందమామ – మల్లెన్నడొస్తావు చందమామ
యాడాదికోపారి చందమామ – నువ్వొచ్చిపోవమ్మ చందమామ (3)
కాకర పూవుల్ల చందమామ – బతుకమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగాని చందమామ – మల్లెన్నడొస్తావు చందమామ
యాడాదికోసారి చందమామ – నువ్వొచ్చి పోవమ్మ చందమామ (4)
కట్లాయి పూవుల్ల చందమామ – బతుకమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగాని చందమామ – మల్లెన్నడొస్తావు చందమామ
యాడాదికోసారి చందమామ – నువ్వొచ్చి పోవమ్మ చందమామ (5)
రుద్రాక్ష పూవుల్ల చందమామ – బతుకమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగాని చందమామ – మల్లెన్నడొస్తావు చందమామ
యాడాదికోసారి చందమామ – నువ్వొచ్చి పోవమ్మ చందమామ (6)
గుమ్మడి పూవుల్ల చందమామ – బతుకమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగాని చందమామ – మల్లెన్నడొస్తావు చందమామ
యాడాదికోసారి చందమామ – నువ్వొచ్చి పోవమ్మ చందమామ (7)

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.