హిందు ధర్మ గ్రంధాలు అధ్యయనం చేయడం ఒకింత కష్టమైన పనే.. ఎందుకంటే అనేక గ్రంథాలు ఉండడం ఒకటి అయితే ఒకే సందర్భం వేరే వేరే గ్రంధాలలో ఒక్కోలా చెప్పడం ఒకటి కారణం అవుతుంది… అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం మరో సందర్భంలో తెలుసుకుందాం..

ఈ రోజు మనం పరమేశ్వరుని తత్వం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మానవులందరు ఒకే మనిషి సంతానం కాదు 14 మనువులు, ప్రజాపతులు వంటివారీ యొక్క సంతానం.. కనుకనే ఈ వివాహం, కుటుంబం వంటి వ్యవస్థలు వచ్చాయి…

ముఖ్యంగా దేవతలు, మరియు అసురులు కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు అయిన దితి, అదితి ల యొక్క సంతానమే.. దేవుడు ఎవరిని పుట్టుకతోనే నీవు రాక్షసుడివి, నీవు దేవునివి అంటూ పుట్టించడు… దేవుడు మనిషిని మొదటి జన్మగా సృష్టించేటప్పుడు సంపూర్ణ ఆయుష్షు, జ్ఞానం, కీర్తి, వివేకం, సంపదలతో పుట్టిస్తాడు. (ఒక్కోసారి సంపద లేకుండా చేయొచ్చు) అయితే మనిషికి కర్మ స్వేచ్ఛ ఆలోచన స్వేచ్ఛ ఇస్తాడు. అయితే మనిషి తాను చేసే ఆలోచన కర్మలను బట్టి మరుసటి జన్మలు ఇవ్వడం జరుగుతుంది.. ఇది గ్రహించాలి..

పరమేశ్వరునికి నామ, కాల, క్రియా వంటివి ఉండవు.. అని మీరెలా చెప్తారు అని అంటే సమాధానం ఇస్తున్న చూడండి.. ఏ హిందు గ్రంథాలలోనైన విష్ణువు గాని శివుడు గాని స్వయంగా నా పేరు ఇది అని చెప్పరు కావాలంటే మీరే చూడండి.. మరి అవి పేర్లు కావా? అంటారేమో అవి పేర్లు కావు… వాటికి ఒక వ్యుత్పత్తి అర్థం అని ఒకటి ఉంటుంది.. విష్ణువు అంటే విశ్వం అంతా వ్యాపించినవాడు అని అర్థం, మరి శివుడు అంటే శుభములు కలుగజేయువాడు అని అర్థం.. నారాయణుడు అంటే నారము అంటే నీటిపై ఉండేవాడు అని అర్థం.. పేరు ఎందుకు ఉండదు అంటే ఆది అంతము లేని వానికి ఎవరు పేరు పెట్టారు.. ఆయనకు ఆయన అయితే పెట్టుకొడు కదా..

భగవద్గీత లో ఏ పేరుతో పిలిచిన నన్నే అని కృష్ణుడు చెప్పలేదా..? మరి కృష్ణుడు, రాముడు ఇవన్నీ పేర్లే కదా అంటారేమో ? అవును పేర్లే అయితే అవి అవతారాలు అనే తేడా తెలుసుకోవాలి.. అయిన అన్ని పేర్లు ఆయానవే అయినప్పుడు ఆయానకంటూ ఇంకో పేరెందుకు?..

కాలం అంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం వంటి తేడాలు ఏమి ఉండవు ఎందుకంటే అన్ని కాలాలు ఆయన ముందే జరుగుతాయి అనే విషయం అర్ధం చేసుకుంటే ఇది అర్థం అయిపోతుంది..

ఇక క్రియ, క్రియ అంటే పని అని అర్థం.. ఆ పరమేశ్వరునికి ప్రత్యేకంగా చేయవలసిన పనేమీ లేదు.. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ తప్పా.. అది పనేగా అంటారేమో? అది ఆయన తన కోరికలు తీర్చుకొనేందుకు చేసే పని కాదు మన కోసం చేసే పని. ఏదైతే కోరిక తీర్చుకొనేందుకు చేస్తామో అదే పని అవుతుంది.. ఇదీ అర్థం చేసుకోవాలి.. అందుకే భగవద్గీత లో నిష్కామ క్రియ గురించి వివరంగా చెప్పాడు పరమాత్మ..

శిక్షించడంలో గాని రక్షించడంలో గాని పరమేశ్వరునికి పక్షపాతం ఉంటుందా..? అని అడిగితే అస్సలు ఉండదు.. ఎవరిని ఊరికే శిక్షించాలని ఎప్పుడు ఆ పరమేశ్వరుడు అనుకోడు.. ఆది వరాహ అవతారంలో భుదేవికి స్వామి వారికి ఇద్దరు పుత్రులు పుడతారు, ఆతరువాత నరకాసురుడు అనే వాడు పుడతాడు.. వాళ్ళు చేసిన పాపాలకు వాళ్ళను సంహరించాడు.. కనుక ఆ పరమేశ్వరునికి ఎటువంటి పక్షపాతం లేదు.. మరి ఇప్పుడు రాక్షసులనే శిక్షిస్తాడు కదా అంటారేమో ? వారి పాపాలకు వారిని శిక్షించాడు.. ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి, విభీషణుడు, శిబి వంటి ఎందరోనో తన అక్కున చేర్చుకోవడం జరిగింది.. కనుక మనకు ఇప్పుడు ఏం అర్థం అయ్యింది.. పరమేశ్వరుడు పక్షపాతం లేని వాడు అని..

మనుషులపై పరమేశ్వరునికి వివక్ష ఉందా? అస్సలు లేదు అని నేను అంటాను . మరి ఎప్పుడు చూసినా బ్రాహ్మణ పక్షపాతం కనిపిస్తుంది కదా ?! అంటారేమో .. బ్రాహ్మణ అనే దాని అర్థం తెలిస్తే బ్రాహ్మణ అంటే తెలుస్తుంది… బ్రాహ్మణ అంటే బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడు అని అర్థం..

అసలు వాస్తవానికి మనం అందరం బ్రాహ్మణులమే ఎలా అంటే బ్రహ్మ మనసులో నుండి పుట్టిన వారు మనువులు అంటే మనం మనువు సంతానం కనుక బ్రాహ్మణులమే. మరి ఈ కులాలు ఎలా వచ్చాయి …? ఒక డాక్టర్ తన కొడుకు లేదా కూతురుని డాక్టర్ చేయాలని అనుకున్నట్టే.. ఒక పూజారి తన పిల్లలను అలా చేయడం వల్ల ఇది అన్ని వర్ణాలలో కొనస్సాగడం వల్ల కులాలు వచ్చాయి..

భగవద్గీత లో ఆ *పరమాత్మ మనుషులను పుట్టుక ఆధారంగా కాకుండా గుణ కర్మలను బట్టి వర్ణాలు చేశాను అని అంటాడు. వర్ణాలు నాలుగు 1. బ్రాహ్మణ, 2. క్షత్రియ, 3. వైశ్య, 4. శూద్ర ఇవే వర్ణాలు.. వేదం చదవడం, ధర్మ ప్రచారం చేయడం, పూజలు చేయడం వంటివి చేస్తే వాడు బ్రాహ్మణుడు.. ఎవరైనా కొన్ని పద్ధతులు అనుసరించడం ద్వారా బ్రాహ్మణులు కావచ్చు ..

ఇక క్షత్రియులు రాజ్యపాలన రక్షణ చేసేవారు క్షత్రియులు.. మరీ ఈ క్షత్రియులు ఎవరు అంటే ప్రత్యేక కులం అంటూ ఏదీ లేదు ఎందుకంటే చాళుక్యులు, శాలివాహనులు, రెడ్డి *రాజులు, వెలమలు, యాదవులు ఇలా భిన్న కులలా వాళ్ళు పాలించారు * కనుక క్షత్రియ కులం అని ఏదో చెప్పలేం ..

ఇక వైశ్య వ్యాపారం చేసే వారు వైశ్యులు.. ఎవరైనా వైశ్యుడు కావొచ్చు.. ఎలాగంటే ఒక రైతు తన పంటను అమ్మేటప్పుడు ఏం చేస్తాడు? వ్యాపారం, కదా! కనుక అప్పుడు రైతు వైశ్యుడే ..

ఇక శూద్రుడు ఈ పదం వద్ద కొన్ని మెలికలు ఉన్నాయి.. అవి తెలుసుకుందాం 1. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారికి సేవ చేసేవాడు (అంటే ఉద్యోగి).. (ఇదే ఇక్కడ అసలు అర్థం ).. 2. ఉపనయన మొదలగు సంస్కారాలు పాటించని వారు (ఇది భాషలో నానార్థాలు వల్ల వచ్చే ఒక అర్థం).. మనం మొదటి అర్థం వ్యవహారంలో వాడాలి..

మరి శూద్రులకు రాజ్యాధికారం రాకూడదు కానీ వస్తుంది అని భాగవతం , భగవద్గీతలో ఉంది కదా అంటే మనం రెండో అర్థం చెప్పుకున్నామే ఆ అర్థం ఇక్కడ తీసుకోవాలి.. ఏ పద్దతి పాడు పాటించని వాడు అని.. ఇది అర్థం చేసుకోలేకే ఈ సమాజంలో కొందరు అల్లర్లు చేస్తున్నారు.. దేవునికి బ్రాహ్మణుడు అయిన ఒకటే శూద్రుడు అయిన ఒకటే.. అని ఎలా చెప్పగలవు అంటే రాక్షసులు అందరూ రావణుడు, హిరణ్యకశిపుడు వంటి వారంతా బ్రహ్మ మానస పుత్రుల యొక్క సంతానమే అంటే వారంతా బ్రాహ్మనులె అయిన వారిని శిక్షించాడు..

భక్త కన్నప్ప శూద్రుడు అయిన తన వద్దకు చేర్చుకున్నాడు, శబరి ఎంగిలి పళ్ళు తిన్నాడు , గుహునితో స్నేహం చేశాడు, అంత ఎందుకు శ్రీ కృష్ణుడు యాదవ వంశము లో పుట్టి పెరిగి , ఆడిపాడినాడు వాళ్లంతా శూద్రులే ..కృష్ణ రాయబారం లో విదురుడు ..ఇంటి ఆతిధ్యమే స్వీకరించాడు..ఆయన శూద్రుడే.. అంతా ఎందుకు వ్యాసుడు, వాల్మీకి మన ధర్మ గ్రంథాలు రాసిన వారు .. వాళ్ళు శూద్రులే ..కనుక ఇక్కడ ఎవరైనా శిక్షించ బడితే అది వారి కర్మ ఫలం అని గ్రహించాలి.. రక్షించబడిన అది వారి కర్మ ఫలమే కానీ వేరొకటి కాదు అని గ్రహించండి..

ఇక మనకు దీని ద్వారా ఏం అర్థమైంది అంటే పరమేశ్వరునికి నామ ,రూప ,కాల , క్రియ , వర్ణ ,స్త్రీ పురుష పక్షపాతం వంటివేవి అంటవు అని తెలుసుకోవాలి …

తరువాతి భాగంలో రామాయణంలో ఎవరు గొప్ప అనే అంశం చర్చిద్దాం..
-మీ శేఖర్ ఓరుగల్లు.

One response to “పరమేశ్వరుని తత్వం ఏమిటీ? – వర్ణాలు వివరణ”

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.