ఇది కాస్త పెద్దదే కానీ ఒక సందేహ నివృత్తి చేయగలదు కనుక ఓపికగా చదవండి..
భగవంతుడు “సర్వాంతర్యామి” అని అంటారు కదా ?! మరి మనము ఏం చేసినా దానిని ఆ భగవంతుడు చేయించినట్లే కదా.. అంటారు కొందరు..
అవును కొందరు అనుకున్నట్లే.. ఆ భగవంతుడు “సర్వాంతర్యామి“, “సర్వవ్యాపి“, “సర్వాంతరజ్ఞాని” యే.. అంటే భగవంతుడు మనలోనూ, అందరిలోనూ ఉన్నాడు.
అయితే ఆయన నీలో ఉన్నది నీ చేత ఏ పనైనా చేయించడానికి కాదు. నీలో ఉండి నువ్వు చేసే పనులు చూడ్డానికి.. నీ దేహానికి శక్తిగా, నీ బుద్ధికి, మనసుకు, ఆలోచనకు, కర్మకు స్వేచ్ఛ ఇచ్చి.. నీ “కర్మ సాక్షిగా” ఉంటాడు. అంతే తప్ప నీ కర్మలకు “కర్త” గా కాదు..
“శివుడి ఆజ్ఞ లేనిదేచీమైన కుట్టదు” అని అంటారు కదా!? మరి మనం తప్పు చేసినా, మంచి చేసిన శివుని ఆజ్ఞా వల్లనే కదా !? అంటారు కొందరు.
అయ్యా అది, అదే ఆ సామెత లేదా జాతీయం అది ఏదైనా కావచ్చు అది “జనన, మరణాలకు” సంబంధించినది. లేదు, కాదు, మీరు అనుకున్నట్లే అనుకుందాం.. అంటే ఏదైనా ఆయన ఆజ్ఞా వల్లనే జరుగుతుంది అనుకుందాం.. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి ఏమిటంటే.. ఆ దేవుడు మనకు “ఆలోచన స్వేచ్ఛ” ను,” కర్మస్వేచ్ఛ”ను ఇచ్చాడు అది అర్థం చేసుకోవాలి…..
ఇప్పుడు మీ దగ్గరికి ఒక స్త్రీ “పిచ్చి కామ కోరిక” గలది లేదా నువ్వంటే పడి చచ్చేది వచ్చింది అనుకుందాం.. (మొదటిది ఎలాగూ వదలదు, రెండవది వలపు విడవదు) సరే ఇప్పుడు నీకు ఆ స్త్రీ ” సంభోగవాంఛ” కోరింది అనుకుందాం.. నువ్వు సంగమించావంటే “సంభోగ సంబంధ సుఖ వ్యాధి, అప కీర్తి” లభిస్తుంది.. అదే ఆమెను ఒప్పించి మెప్పించి పంపించావునుకో.. ఆమె నీ గురించి నలుగురికి మంచిగా చెప్తాది.. కనుక “కీర్తి లభిస్తుంది, సుఖవ్యాది బాధా తప్పుతుంది” కనుక ఇప్పుడు ఆలోచించండి..
ఆ శివుడి ఆజ్ఞా తో వచ్చిన ఆ పరీక్షలో నువ్వు ఓడితే “పాపం” అనే చీమ కుడుతుంది, లేదా గెలిస్తే “కీర్తి” అనే చీమ కుడుతుంది కనుక మీరన్నట్లే శివునాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అనేది నిజమే కదా.. అయితే మనము ఇక్కడ ఎలా స్పందించాం అనే దానిపై ఏ చీమ కుడుతుంది అనేది ఆధారపడి ఉంటుంది, ఇది కేవలం ఈ ఒక్క సందర్భానికో ,మగ వానికో సంబంధించినది కాదు అన్ని సందర్భాలకు ,అందరికి సంబంధించినదే సందర్భనుసారంగా అర్థము చేసుకోవాలి ….
– మీ శేఖర్ ఓరుగల్లు ..
Very Nice Article, Thanks for writing