పరమేశ్వరుని తత్వం ఏమిటీ? – వర్ణాలు వివరణ

హిందు ధర్మ గ్రంధాలు అధ్యయనం చేయడం ఒకింత కష్టమైన పనే.. ఎందుకంటే అనేక గ్రంథాలు ఉండడం ఒకటి అయితే ఒకే సందర్భం వేరే వేరే గ్రంధాలలో ఒక్కోలా చెప్పడం ఒకటి కారణం అవుతుంది… అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం మరో సందర్భంలో తెలుసుకుందాం..

ఈ రోజు మనం పరమేశ్వరుని తత్వం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మానవులందరు ఒకే మనిషి సంతానం కాదు 14 మనువులు, ప్రజాపతులు వంటివారీ యొక్క సంతానం.. కనుకనే ఈ వివాహం, కుటుంబం వంటి వ్యవస్థలు వచ్చాయి…

ముఖ్యంగా దేవతలు, మరియు అసురులు కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు అయిన దితి, అదితి ల యొక్క సంతానమే.. దేవుడు ఎవరిని పుట్టుకతోనే నీవు రాక్షసుడివి, నీవు దేవునివి అంటూ పుట్టించడు… దేవుడు మనిషిని మొదటి జన్మగా సృష్టించేటప్పుడు సంపూర్ణ ఆయుష్షు, జ్ఞానం, కీర్తి, వివేకం, సంపదలతో పుట్టిస్తాడు. (ఒక్కోసారి సంపద లేకుండా చేయొచ్చు) అయితే మనిషికి కర్మ స్వేచ్ఛ ఆలోచన స్వేచ్ఛ ఇస్తాడు. అయితే మనిషి తాను చేసే ఆలోచన కర్మలను బట్టి మరుసటి జన్మలు ఇవ్వడం జరుగుతుంది.. ఇది గ్రహించాలి..

పరమేశ్వరునికి నామ, కాల, క్రియా వంటివి ఉండవు.. అని మీరెలా చెప్తారు అని అంటే సమాధానం ఇస…

Read more
  • 1

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు: తత్వ బోధ – నీతి సుధ

ఇది కాస్త పెద్దదే కానీ ఒక సందేహ నివృత్తి చేయగలదు కనుక ఓపికగా చదవండి..

భగవంతుడు "సర్వాంతర్యామి" అని అంటారు కదా ?! మరి మనము ఏం చేసినా దానిని ఆ భగవంతుడు చేయించినట్లే కదా.. అంటారు కొందరు..

అవును కొందరు అనుకున్నట్లే.. ఆ భగవంతుడు "సర్వాంతర్యామి", "సర్వవ్యాపి", "సర్వాంతరజ్ఞాని" యే.. అంటే భగవంతుడు మనలోనూ, అందరిలోనూ ఉన్నాడు.

అయితే ఆయన నీలో ఉన్నది నీ చేత ఏ పనైనా చేయించడానికి కాదు. నీలో ఉండి నువ్వు చేసే పనులు చూడ్డానికి.. నీ దేహానికి శక్తిగా, నీ బుద్ధికి, మనసుకు, ఆలోచనకు, కర్మకు స్వేచ్ఛ ఇచ్చి.. నీ "కర్మ సాక్షిగా" ఉంటాడు. అంతే తప్ప నీ కర్మలకు "కర్త" గా కాదు..

"శివుడి ఆజ్ఞ లేనిదేచీమైన కుట్టదు" అని అంటారు కదా!? మరి మనం తప్పు చేసినా, మంచి చేసిన శివుని ఆజ్ఞా వల్లనే కదా !? అంటారు కొందరు.

అయ్యా అది, అదే ఆ సామెత లేదా జాతీయం అది ఏదైనా కావచ్చు అది "జనన, మరణాలకు" సంబంధించినది. లేదు, కాదు, మీరు అనుకున్నట్లే అనుకుందాం.. అంటే ఏదైనా ఆయన ఆజ్ఞా వల్లనే జరుగుతుంది అనుకుందాం.. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి ఏమిటంటే.. ఆ దేవుడు మనకు "ఆలోచన స్వేచ్ఛ" ను,…

Read more
  • 1