శ్రీ క్రుష్ణుడు కురుక్షేత్ర సంగ్రామం సమయంలో అర్జునకు ఉపదేశించిన భగవద్గీత ఒక యోగ శాస్త్రము. మొట్ట మొదట భగవద్గీత శ్రీ క్రుష్ణుడిచే సూర్యభగవానునకు ఉపదేశించబడినది. సూర్యభగవానుడు ఈ పవిత్ర ఉపనిషత్తుల సారమును మొదటి మానవుడగు “మను” కు చెప్పినట్లుగ పురాణములలో చెప్పబడినది.
సమయ వ్యవధిలో లోకములో గీతా సారము యొక్క జ్ఞానం తగ్గడము వలన శ్రీ క్రుష్ణుడు మరల తన మిత్రుడు, శిష్యుడు అయినటువంటి అర్జునునకు ఉపదేశించెను.
కౌరవుల తండ్రయిన ద్రుతరాష్ట్రుని యొక్క సలహాదారు మరియు రథ చోదకుడగు సంజయుడు తన గురువు వేద వ్యాసుడు ఇచ్చిన దూరద్రుష్టి వరముతో కురుక్షేత్ర యుద్దములో జరుగుతున్న విషయములను అంధుడగు ద్రుతరాష్ట్రునకు వివరించుతాడు.
Bhagavad-Gita Telugu PDF free Download.